Jagan: జగన్ అధ్యక్షతన వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం..! 19 d ago
AP: బెంగళూరు నుంచి వైఎస్ జగన్ మంగళవారం సాయంత్రం 5:30 గంటలకు తాడేపల్లికి చేరుకుంటారు. బుధవారం వైఎస్ జగన్ అధ్యక్షతన వైసీపీ రాష్ట్ర స్థాయి సమావేశం జరగనుంది. పార్టీ జిల్లాల అధ్యక్షులు, రాష్ట్ర రీజినల్ కో ఆర్డినేటర్లు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులతో సమావేశం కానున్నారు. పార్టీ బలోపేతం, నిర్మాణంపై జగన్ దృష్టి పెట్టారు. రాబోయే రోజుల్లో పార్టీ తరుపున నిర్వహించాలసిన ప్రజా పోరాటాలపై చర్చించనున్నారు.